Allu Sirish Pre-Wedding: అల్లు శిరీష్ ప్రీ–వెడ్డింగ్ పార్టీ అదిరింది.. తరలివచ్చిన సినీ స్టార్స్.. ఫోటోలు, వీడియోలు వైరల్

Allu Sirish Pre-Wedding: అల్లు శిరీష్ ప్రీ–వెడ్డింగ్ పార్టీ అదిరింది.. తరలివచ్చిన సినీ స్టార్స్.. ఫోటోలు, వీడియోలు వైరల్

అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ చిన్నకుమారుడు అల్లు శిరీష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మరో మూడు రోజుల్లో (మార్చి 6న) శిరీష్ వివాహం జరగనుంది. తన ప్రియురాలు నయనికతో కలిసి ఏడడుగులు వేయబోతున్నారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాలో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుక నిర్వహించింది అల్లు ఫ్యామిలీ. 

అల్లు కుటుంబ నివాసంలో జరిగిన సంప్రదాయ ‘పెళ్లికొడుకు’ కార్యక్రమం అనంతరం సాయంత్రం రిసెప్షన్‌ ఘనంగా నిర్వహించారు. కోకాపేటలోని ‘అల్లు స్టూడియోస్‌’లో (మార్చి 2న) నిర్వహించిన ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇందులో భాగంగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమల తారలు అటెండ్ అయ్యి సందడి చేశారు. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సభ్యులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రామ్ చరణ్-అల్లు అర్జున్ స్టైలిష్ లుక్‌లో కనిపించి అభిమానులను అలరించారు. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

టాలీవుడ్‌ నుంచి బాలకృష్ణ, మోహన్‌బాబు, నాగార్జున, నాని, రవితేజ, నాగచైతన్య, గోపీచంద్‌, రానా దగ్గుబాటి, ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, శ్రీ విష్ణు, బ్రహ్మానందం, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్‌, చంద్రబోస్ హాజరై కొత్తజంటతో ఫోటోలు దిగారు.

దర్శకులు సుకుమార్, అనిల్ రావిపూడి, బుచ్చిబాబు, అట్లీ, సందీప్ రెడ్డి వంగా, బాసిల్ జోసెఫ్, రాఘవేంద్రరావు, వి.వి. వినాయక్‌, నిర్మాత అశ్వనీదత్‌, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, తమన్, నటి మీనాక్షి చౌదరి, మంచు లక్ష్మి తదితరులు సందడి చేశారు. 

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలు, వీడియోల్లో ఈ సినీ స్టార్స్ మధ్య నవ్వులు, ఆప్యాయ సంభాషణలు, కుటుంబ బంధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుక మెగా ఫ్యామిలీ ఐక్యతకు మరోసారి నిదర్శనంగా నిలిచింది.