
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(టీజీపీసీబీ)లో మంగళవారం ఆషాఢ మాస బోనాలు మంగళవారం వైభవంగా జరిగాయి. అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పూలతో సుందరంగా ముస్తాబు చేసారు. పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు బోనాలు సమర్పిస్తూ అమ్మవారిని దర్శించుకొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
మహిళలు నృత్యాలు చేస్తూ, ర్యాలీగా అమ్మవారికి ఆలయానికి వెళ్లారు. ఈ బోనాల ఉత్సవంలో టీజీపీసీబీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.మధు గౌడ్ జనరల్ సెక్రటరీ ఆర్.నవీన్ గౌడ్, వివేకానందమూర్తి, రాజారమేశ్, వెంకట్ రావు, స్వామి, బాబుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి కలెక్టరేట్లో..
రంగారెడ్డి కలెక్టరేట్: రంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా ఉద్యోగులు బోనాల వేడుకలు నిర్వహించారు. పోతురాజుల ఆటపాటల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు.