పాలకుర్తి, వెలుగు : రోడ్డు పక్కన ఆపి ఉన్న బోరు బండిని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదం జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర, రాఘవాఫురం గ్రామాల మధ్య గురువారం రాత్రి జరిగింది. ఎస్సై దూలం పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తి మండలంలోని నర్సింగాపురం తండాకు చెందిన బాదావత్ తిరుపతి(35), కేతావత్ నరేందర్ (25) గురువారం పాలకుర్తికి వచ్చారు.
అక్కడ పని ముగించుకున్నఅనంతరం రాత్రి 10 గంటల సమయంలో బైక్ పై తండాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బమ్మెర, రాఘవాఫురం గ్రామాల మధ్యలోకి రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న బోరు బండిని ఢీకొట్టారు. నరేందర్ అక్కడికక్కడే చనిపోగా, తిరుపతి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు తిరుపతిని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించగా.. ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయాడు.
