ఏడో రోజు సేమ్ సీన్: పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

ఏడో రోజు సేమ్ సీన్: పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఏడో రోజు సేమ్ సీన్ నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కాగానే వాయిదా పడ్డాయి. మంగళవారం (జులై 28) యాంటి పేపర్ లీక్ బిల్లుపై ప్రభుత్వం చర్చకు సిద్ధమవగా.. నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన యువతపై పోలీసుల లాఠీచార్జ్‎పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్షాల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. 

రాజ్య సభలోనూ సేమ్ ఇదే పరిస్థితి నెలకొంది.  యువతపై పోలీసుల లాఠీచార్జ్‎పై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల ఆందోళనతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. దీంతో యాంటి పేపర్ లీక్ బిల్లుపై చర్చ ప్రారంభం కాలేదు. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చకు సహకరించాలన్నారు. 

ఎన్డీఏ, ఇండీ కూటమి వ్యూహాత్మక సమావేశాలు:

మంగళవారం (జులై 28) పార్లమెంటులో యాంటీ లీక్ పేపర్ బిల్లుపై జరగబోయే కీలక చర్చకు ముందు అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి రెండూ వేర్వేరుగా వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించాయి. ఎన్డీఏ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించగా.. ఖర్గే నేతృత్వంలో ఇండియా కూటమి భేటీ అయ్యింది. ఇరువర్గాలు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చించాయి.