మద్యం మత్తులో బౌన్సర్లపై దాడి..కొండాపూర్ వైట్ఫీల్డ్ రోడ్డులోని మ్యాడ్ క్లబ్ పబ్ లో ఘటన

మద్యం మత్తులో బౌన్సర్లపై దాడి..కొండాపూర్ వైట్ఫీల్డ్ రోడ్డులోని మ్యాడ్  క్లబ్ పబ్ లో ఘటన

మాదాపూర్​, వెలుగు: పబ్​లో మద్యం మత్తులో ఓ గ్యాంగ్​ హల్​చల్​ చేసింది. బిల్లులో డిస్కౌంట్​ ఇవ్వాలని పబ్​ నిర్వాహకులతో గొడవ పడి అడ్డు వచ్చిన బౌన్సర్లపై దాడికి పాల్పడ్డారు. దీంతో నలుగురు బౌన్సర్లకు గాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఈ నెల 20న  నగరానికి చెందిన శివ, జితేశ్, ప్రశాంత్, సదానంద్​పాటు సుమారు 20 మంది యువకులు కొండాపూర్​ వైట్​ఫీల్డ్​ రోడ్డులో ఉన్న మ్యాడ్​ క్లబ్​ పబ్​కు వెళ్లారు. అందరూ కలిసి ఫుల్​గా మద్యం తాగారు. బిల్లు రూ.18 వేలు కాగా డిస్కౌంట్​ ఇవ్వాలని పబ్​ మేనేజర్​తో గొడవ పడ్డారు. 

అక్కడే ఉన్న బౌన్సర్లు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బౌన్సర్లు అఫ్రోజ్,​ ప్రశాంత్, మాజీద్​, రషీద్​, చరణ్​ గాయపడ్డారు. పబ్​ ఓనర్​ ప్రశాంత్​రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్​ ఇన్​స్పెక్టర్​ కృష్ణ మోహన్​ తెలిపారు.