
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఇతర నిందితులను రెండురోజుల్లో పట్టుకుంటామన్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. అఖిల ప్రియ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని.. విచారణలో వచ్చిన వాస్తవాలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ లను కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. అఖిలప్రియ కస్టడి పూర్తయిన తర్వాత.. రేపు(గురువారం) చంచల్ గూడ జైలుకు పంపిస్తామన్నారు . మరోవైపు ఈస్ట్ . సౌత్ జోన్ పరిధిలో వరుస దొంగతనాలు చేస్తున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశామన్నారు సీపీ. వారి దగ్గర బంగారం, డబ్బులతో పాటు ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.