
మంగళూర్: పబ్జీ ఆట విషయంలో జరిగిన గొడవ బాలుడి హత్యకు దారితీసింది. ఈ ఘటన కర్నాటకలోని మంగళూర్లో ఆదివారం జరిగింది. ఉల్లాల్ సిటీకి చెందిన మహమ్మద్ అకీఫ్(12) పబ్జీ గేమ్‌కు అడిక్ట్ అయ్యాడు. ఆన్ లైన్లో పరిచయమైన మరో టీనేజర్(17) తో తరచూ గేమ్ ఆడుతుండేవాడు. అయితే ప్రతిసారీ అకీఫ్ గెలుస్తుండేవాడు. దీంతో అతడు వేరే వాళ్ల సాయం తీసుకొని గెలుస్తున్నాడని టీనేజర్ ఆరోపించాడు. ఇద్దరం డైరెక్ట్‌గా కూర్చొని గేమ్ ఆడుదామని సవాల్ విసిరాడు. దానికి అకీఫ్ అంగీకరించాడు. శనివారం ఇద్దరూ కలిసి గేమ్ ఆడారు. అందులో అకీఫ్ ఓడిపోయాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అకీఫ్.. టీనేజర్‌పై రాయి విసిరాడు. దీంతో అతడు కోపంలో పెద్దరాయిని అకీఫ్ పైకి విసిరాడు. అకీఫ్ అక్కడికక్కడే చనిపోయాడు. డెడ్ బాడీని పక్కకు ఈడ్చుకెళ్లి.. అరటి, కొబ్బరి ఆకులు కప్పి టీనేజర్ వెళ్లిపోయాడు. ఆదివారం డెడ్ బాడీ భయటపడడంతో హత్య వెలుగులోకి వచ్చింది.