8మంది SIలు ముగ్గురు DCPలు మారినా.. కొడుకు జాడ దొరకలేదు

8మంది SIలు ముగ్గురు DCPలు మారినా.. కొడుకు జాడ దొరకలేదు

హైదరాబాద్ : 7 సంవత్సరాల క్రితం కిడ్నాప్ అయిన తమ కొడుకును ఎలాగైనా వెతికి అప్పగించాలని శంషాబాద్ పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. 2013 ఏప్రిల్17న శంషాబాద్ ఆర్బీ నగర్ లోని ఆల్ఫా ప్రైవేట్ స్కూలుకు అక్కతో వెళ్తుండగా.. బాలుడు సంతోష్(5)ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. సంతోష్ ను బైక్ పైన ఎక్కించుకొని కిడ్నాపర్లు పారిపోయారు. ఈ సంఘటనపై అప్పట్లోనే ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితంలేకుండా పోయిందని తెలిపారు తల్లిదండ్రులు.

నలుగురు CIలు.. 8మంది SI లు ముగ్గురు DCPలు మారినా.. ఇప్పటికీ కేసు కొలిక్కిరాలేదని తెలిపారు. కిడ్నప్ అయిన సంతోష్ బ్రతికి ఉన్నాడా.. మరి ఏదైనా చేసారా.. అని తెలియక తల్లడిల్లుతున్నామని చెప్పారు. శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ లోని డీసీపీ ప్రకాష్ రెడ్డిని కలిసి, తమ కొడుకును ఎలాగైనా వెతికిపెట్టమని కన్నీటి పర్యంతం అయ్యారు సంతోష్ తల్లిదండ్రులు.