రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు లేవ్​

రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు లేవ్​

నిరుద్యోగులు వృత్తి విద్యపై దృష్టి పెట్టాలె
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్

బోయినిపల్లి, వెలుగు: ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు లేవని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. నిరుద్యోగ యువత వృత్తి విద్య వైపు దృష్టి సారించాలని సూచించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం అనంతపల్లిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో హైదరాబాద్ లో పని చేసే ఇతర రాష్ట్రాలకు చెందిన చాలామంది స్వస్థలాలకు వెళ్లారని అన్నారు. గ్రామాల్లోని యువత ఆయా పనులపై దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలతో ఎస్సీ, ఎస్టీ లకు ప్రత్యేక జీవోతో నోటిఫికేషన్ ఇవ్వాలని
సీఎంతో మాట్లాడతానని పేర్కొన్నారు. బోయినిపల్లి మండలం ఆరేళ్లుగా అభివృద్ధిలో చాలా వెనుకబడిందని, మండలాన్ని వినోద్ కుమార్ దత్తత తీసుకోవాలని జడ్పీటీసీ ఉమాకొండయ్య విజ్ఞప్తి చేశారు.

For More News..

కేటీఆర్ మోసం చేశాడని ఫిర్యాదు.. కంప్లైంట్ తీసుకోని పోలీసులు

దగ్గుతున్నాడని బస్సులోంచి దింపేసిన్రు.. కాసేపటికే రోడ్డుపై మృతి

ఆస్పత్రి వాష్ రూంలో కరోనా పేషంట్ డెడ్ బాడీ