బ్రాహ్మణులకు మందకృష్ణ క్షమాపణ చెప్పాలి.. బ్రాహ్మణ సంఘాల హెచ్చరిక

బ్రాహ్మణులకు మందకృష్ణ క్షమాపణ చెప్పాలి.. బ్రాహ్మణ సంఘాల హెచ్చరిక

పంజాగుట్ట, వెలుగు: బ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడిన మందకృష్ణ మాదిగ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ నేతలు బస్వరాజు శ్రీనివాస్, రాఘవేంద్ర శర్మ డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో వారు మాట్లాడుతూ.. మార్చి 30న మందకృష్ణ చేసిన ‘అర్చకత్వం బ్రాహ్మణుల పేటెంటా?’ వంటి వ్యాఖ్యలు బ్రాహ్మణ సమాజాన్ని తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయన్నారు.

చరిత్రలోని ప్రతి ఉద్యమంలోనూ బ్రాహ్మణుల త్యాగాలు ఉన్నాయని గుర్తు చేశారు. సమాజంలో సమానత్వం రావాలంటే రిజర్వేషన్ వ్యవస్థపై పునరాలోచించి, తెలివితేటల ఆధారంగా అవకాశాలు కల్పించాలని కోరారు. సమావేశంలో లక్ష్మీనారాయణ దేశాయి, రాఘవరావు, జ్యోతి గంగేశ్వర్ తదితర సభ్యులు పాల్గొన్నారు.