పావురాల వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్.. పెరుగుతున్న కేసులు

పావురాల వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్.. పెరుగుతున్న కేసులు

హైదరాబాద్ లో మనుషులతో పాటు పావురాల పాపులేషన్ కూడా ఎక్కువే. సిటీలోని కొన్ని ప్రాంతాలు పావురాలకు హాట్ స్పాట్ లు. అక్కడికి వచ్చి వాటికి ఫుడ్ పెడుతూ ఫొటోలు దిగుతుంటారు చాలామంది. అంతేకాకుండా ఎక్కడ  చూసినా పావురాలు కనిపిస్తుంటాయి. బిల్డింగులపై నివసిస్తుంటాయి. అయితే, వీటివల్ల ఆనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని  పల్మోనాలజిస్ట్ లు చెప్తున్నారు. పావురాల రెట్టల వల్ల న్యుమోనిటిస్ లేదా తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు, ఎలర్జీ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. 

పావురాల రెట్టల్లో ఉండే రసాయనాలు గాలిలో కలిసి పోతాయి. ఆ గాలి పీల్చినప్పుడు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్తపై ప్రభావం చూపిస్తు్ంది. దాంతో ఊపిరితిత్తుల్లో మంట, హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్ లక్షణాలకు దారితీస్తుంది. తర్వాత దగ్గు, శ్వాస ఆడకపోవడం, జ్వరం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆస్తమా, శ్వాస కోశ ఇబ్బందులు ఉన్నవాళ్లు పావురాలకు దూరంగా ఉండటం మంచిది. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లలో పావురాల వల్ల ఎఫెక్ట్ అయినవాళ్లే ఎక్కువ. గత ఏడెనిమిదేళ్లలో హైపర్‌సెన్సిటివిటీ న్యుమోనైటిస్‌ భారిన పడ్డవాళ్ల సంఖ్య ఐదు రెట్లు పెరిగిందని పల్మోనాలజిస్ట్‌ లు చెప్తున్నారు.