పెళ్లిలో మంటలు అంటించుకున్న వధూవరులు, షాకింగ్ వీడియో 

V6 Velugu Posted on May 13, 2022

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది మధుర ఘట్టం. పెళ్లిని.. మధుర జ్ఞాపకంగా మిగుల్చుకొనేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వినూత్నంగా వివాహం చేసుకుంటూ.. వార్తల్లో నిలుస్తుంటారు. కొంతమంది ఆకాశంలో తేలుతూ.. సముద్రగర్భాన మునుగుతూ పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. తాజాగా.. నూతన వధూవరులు చేసిన పనితో నెటిజన్లు షాకింగ్‌‌కు గురయ్యారు. ఏకంగా నిప్పంటించుకుని... కొంతదూరం నడుచుకుంటూ వచ్చారు. ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా ఉన్న ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో తెలియరాలేదు. 

స్టంట్ మ్యాన్ గా పేరొందిన Gabe Jessop వివాహం Ambyr Bambyr Mishelle తో జరిగింది. సంప్రదాయబద్ధంగా కాకుండా వినూత్నంగా పెళ్లి చేసుకోవాలని, థ్రిల్, సస్పెన్ష్ తో ఎంట్రీ ఇవ్వాలని భావించారు. వివాహ ప్రమాణాలు మొత్తం పూర్తయిన తర్వాత...వధూవరులకు వెనుక నుంచి నిప్పంటించారు. ఏ మాత్రం భయపడకుండా.. వాళ్లిద్దరూ ముందుకు నడుచుకుంటూ వచ్చారు. పెళ్లికి వచ్చిన అతిథులు, ఇతరులు వీరిని ఉత్సాహపరిచేందుకు చప్పట్లు కొట్టారు. మంటలు ఎగిసిపడుతున్నా చేయి చేయి పట్టుకుని వస్తున్న వధూవరుల వెనుక ఓ వ్యక్తి ఎలాంటి ప్రమాదం జరుగకుండా నిల్చొన్నాడు. అనంతరం ముందుకు వచ్చి కాళ్లపై కూర్చొగానే.. వెనుకానే ఉన్న వారు మంటలను ఆర్పివేశారు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ క్యాప్చర్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ కు గురయ్యారు. నిజంగానే భావుందని కొంతమంది మెచ్చుకోగా.. మరికొంతమంది మంత్రముగ్దులయ్యామంటూ కామెంట్స్ చేశారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరిన్ని వార్తల కోసం
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు అరెస్ట్

మద్యం మత్తులో యువకుల వీరంగం

Tagged , Bride and groom, Bride And Groom Set for, wedding day fire, daredevil stunt, Stuntman Game Jessop, Ambyr Ambyr Mishelle

Latest Videos

Subscribe Now

More News