భారత్ పాక్ దేశాల మధ్య పెళ్లి సంబంధాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుని సరిహద్దులు దాటుతుంటే..మరి కొందరు పెద్ద కుదుర్చిన సంబంధాలను చేసుకుని సరిహద్దులు దాటుతున్నారు. మొన్న సీమా హైదర్..తన ప్రియుడి కోసం పాకిస్తాన్ నుంచి ఇండియా వస్తే..నిన్న అంజూ..తను ప్రేమించిన వాడి కోసం పాకిస్తాన్ కు వెళ్లింది. తాజాగా పాకిస్తాన్ కు చెందిన ఓ యువతి ఇండియాకు రానుంది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న ఆమె..భారత్ లో కాపురం పెట్టనుంది.
వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ జోధ్‌పూర్‌కు చెందిన అర్బాజ్ అనే యువకుడు కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి కుటుంబీకులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే అతనికి పాకిస్థాన్ యువతితో పెళ్లి నిశ్చయించారు. అర్బాజ్ అన్న సియాక్ కూడా పాక్ యువతినే వివాహం చేసుకున్నాడ. దీంతో పాకిస్తాన్ లో వీరికి బంధువులు ఏర్పడ్డారు. ఈ క్రమంలో అర్బాజ్ కు కూ అక్కడి యువతి అమీనాతో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. రెండు కుటుంబాలు ముహూర్తం కూడా ఖరారు చేశారు. కానీ పెళ్లి కూతురు అమీనా భారత్ కు వచ్చేందుకు వీసా రాలేదు.
అన్నీ ఆన్ లైన్ లోనే..
వీసా రాకపోవడంతో ఏం చేయాలో రెండు కుటుంబాలకు అర్థం కాలేదు. చివరకు అనుకున్న ముహూర్థానికే ఎలాగైనా పెళ్లి చేయాలని అనుకున్నారు. ఆన్‌లైన్ లో పెళ్లి చేయాలని భావించారు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం వరుడు అర్భాజ్, వధువు అమీనా వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలు ల్యాప్ ట్యాప్ ల ద్వారా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ముస్తాబైన వధూవరులను స్క్రీన్ ముందు కూర్చోబెట్టారు. మత పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. రెండు కుటుంబాలు ఆన్‌లైన్ లోనే వారి ఆచారాలను నిర్వహించారు. కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు పెళ్లి తంతును వీక్షించేందుకు రెండు పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లను కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి ముగిసిన అనంతరం వారి వారి ప్రాంతాల్లో విందు భోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు.
వరుడు అర్బాజ్, సియాక్ తాత మహ్మద్ అఫ్జల్ వృత్తిరీత్యా కాంట్రాక్టర్. దీంతో వీరికి కొన్నేళ్ల నుంచే పాకిస్థాన్‌కు చెందిన వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. పెళ్లి కూతురు అమీనాకు వీసా రాగానే భారత్ వస్తుందని వరుడు తండ్రి మహ్మద్ అప్జల్ తెలిపారు. తమ కోడలి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పారు.
