గవర్నమెంట్​ స్కీమ్​ కోసం ఉత్తుత్తి లగ్గాలు

గవర్నమెంట్​ స్కీమ్​ కోసం ఉత్తుత్తి లగ్గాలు

నిండు నూరేండ్లు కలిసి ఉండాలనే ఎవరైనా పెళ్లి చేసుకుంటరు. యూపీలో మాత్రం ఐదొందల కూలీ కోసం పెళ్లి చేసుకుని అరగంట తర్వాత అబ్బాయి, అమ్మాయి ఎటోళ్లు అటు పోయిన్రు.. ఇంకొందరు యువతులైతే మెడలో దండేసుకుని వాళ్లను వాళ్లే పెళ్లి చేసుకున్నరు. ఒకరిద్దరు కాదు ఏకంగా రెండొందల మందికి పైగా ఇలా ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నరు. పెళ్లికూతురులా కనిపించేందుకు యువతులు కాస్త ముస్తాబు కాగా అబ్బాయిలు మాత్రం సింపుల్ గా తలపాగా నెత్తిన పెట్టుకుని వరుసలో నిల్చున్నారు. 

యూపీలో గత నెల 25న జరిగిన సామూహిక వివాహాల్లో ఈ ఫేక్ పెళ్లిళ్ల తంతు నడిచింది. ఎందుకీ నాటకమంటే.. కొత్త జంటలకు యోగి సర్కారు ఇచ్చే రూ.51 వేల నగదు కానుక కోసమని అధికారులు చెబుతున్నారు. ఇందులో కొసమెరుపు ఏమిటంటే.. వివాహ కార్యక్రమం చూద్దామని వచ్చిన యువకులను కూడా వరుడిగా మార్చేయడం. ఇలా దొంగ పెళ్లిళ్లు చేసుకున్న వారిని గుర్తించి, ఇద్దరు అధికారులు సహా 15 మందిపై పోలీసులు కేసులు పెట్టారు.