వీడియో: రూ. 263 కోట్ల విలువైన బ్రిడ్జ్.. నెలరోజుల్లోనే నేలమట్టం

వీడియో: రూ. 263 కోట్ల విలువైన బ్రిడ్జ్.. నెలరోజుల్లోనే నేలమట్టం

కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వంతెన నెలరోజుల్లోనే కూలిన ఘటన బీహార్ లో జరిగింది. గోపాల్‌గంజ్‌ జిల్లాలోని గండక్ నదిపై సత్తర్‌ఘాట్ బ్రిడ్జీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గత నెలలో జూన్ 16న ప్రారంభించారు. ఆ వంతెన బుధవారం కురిసిన వర్షాలకు కూలిపోయింది. ఈ బ్రిడ్జిని రూ .263 కోట్ల వ్యయంతో నిర్మించారు. గత నాలుగు రోజులుగా బీహార్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రాష్ట్రంలోని నదులు, చెరువులు ఏరులై పారుతున్నాయి. బుధవారం కురిసిన వర్షానికి గోపాల్‌గంజ్‌లోని గండక్ నదిలో నీటి మట్టం బాగా పెరిగింది. దాంతో సత్తర్‌ఘాట్ వంతెనలో కొంత భాగం నదీ ప్రవాహానకి కొట్టుకుపోయింది. వంతెన కూలిపోవడంతో చాలా జిల్లాలు అనుసంధానాన్ని కోల్పోయాయి.

వంతెన కూలిన ఘటనపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ స్పందించారు. ‘సత్తార్ ఘాట్ బ్రిడ్జ్ నిర్మించడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది. దీని కోసం రూ .263 కోట్లు ఖర్చు చేశారు. కానీ, ఈ బ్రిడ్జ్ కేవలం 29 రోజుల్లోనే కూలిపోయింది. ఈ అవినీతి గురించి నితిష్ జీ ఒక్క మాట కూడా మాట్లాడరు. బీహార్‌లో ప్రతిచోటా దోపిడీ జరుగుతోంది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్ జిల్లాలను కలిపే ఈ వంతెన పొడవు 1.4 కి.మీ. దీనిని జూన్ 16న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు అంకితంచేశారు. ఈ వంతెన నిర్మాణాన్ని ఎనిమిదేళ్ల క్రితం బీహార్ రాజ్య పుల్ నిర్మన్ నిగం లిమిటెడ్ ప్రారంభించింది.

For More News..

వీడియో: రైతు దంపతులపై పోలీసుల అరాచకం.. ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ

రూ. కోటిన్నర బిల్లు మాఫీ చేసి.. విమాన టిక్కెట్లు కొనిచ్చి మరీ..

కరోనా క్రైసిస్‌‌‌‌తో.. ఉద్యోగాల తీరు మారింది

సర్కారీ పోర్టల్ హ్యాక్ చేసిన అన్నదమ్ములు