
న్యూఢిల్లీ: రూ.760 కోట్ల పబ్లిక్ ఇష్యూను ఈవారంలో ప్రారంభిస్తున్న బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ లిమిటెడ్, ఒక్కో షేరుకు రూ.85-–90 ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించింది. బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన బ్రిగేడ్ హోటల్ వెంచర్స్‌కు దక్షిణ భారతదేశంలో 1,604 గదులతో తొమ్మిది హోటళ్లు ఉన్నాయి.
ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.468.25 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఐపీఓ ఈ నెల 24-–28 తేదీల్లో ఉంటుంది. అప్పర్ ఎండ్‌లో కంపెనీ విలువ రూ. 3,400 కోట్లకు పైగా ఉంది. ఇది పూర్తిగా ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ. అప్పుల చెల్లింపు కోసం రూ. 468.14 కోట్లు ఉపయోగిస్తుంది. మరో రూ. 107.52 కోట్లతో భూమి కొంటుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వాడుతుంది.