క్వీన్ ఎలిజబెత్ – 2 కన్నుమూత

క్వీన్ ఎలిజబెత్ – 2 కన్నుమూత

లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ – 2 (96) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొద్దీ సేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. స్కాట్‌ల్యాండ్‌లోని బాల్‌మోరల్ ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్న రాణి ఎలిజబెత్.. ఇవాళ కన్నుమూసినట్టు ప్యాలెస్ వర్గాలు తాజాగా ప్రకటించాయి. రేపు రాణి ఎలిజబెత్ భౌతిక కాయాన్ని బ్రిటన్ ప్యాలెస్ కు తీసుకురానున్నట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. రాణి మరణంతో బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన రాణిగా ఎలిజబెత్ – 2 గుర్తింపు పొందారు. 

రాణి ఎలిజబెత్ మృతిపట్ల పీఎం మోడీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కాలపు గొప్ప నాయకురాలిగా రాణి ఎలిజబెత్ నిలిచిపోతారని మోడీ ప్రశంసించారు. బ్రిటన్ కు సమర్థమైన, స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని రాణి ఎలిజబెత్ అందించారని మోడీ అన్నారు.