
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బ్రో(Bro) మానియా నడుస్తోంది. ఎక్కడ చూసినా బ్రో నామస్మరణే వినిపిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తోంది. వింటేజ్ లుక్స్ తో స్క్రీన్ పై పవన్ రచ్చ రచ్చ చేశారు. అందుకు తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి.
ఇక మొదటి రోజు ఈ సినిమా ఏకంగా రూ.30 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం. పవన్ ప్రీవియస్ సినిమాల ఓపెనింగ్స్ తో పోలిస్తే ఇది తక్కువే.. అయినప్పటికీ ప్రతికూల వాతావరణంలో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు. ఓపక్క వర్షాలతో రెండు రాష్ట్రాలు తడిసి ముద్దైనా.. వాటిని పట్టుంచుకోకుండా బ్రో సినిమా చూసేందుకు ఎగబడ్డారు ప్రేక్షకులు. ఈ ఒక్క ఎగ్జామ్పుల్ చాలు పవన్ స్టామినా ఏంటో చెప్పడానికి.
ఇక టికెట్ ప్రైస్ కూడా హైక్ చేయలేదు మేకర్స్. ఈ కారణంగా కూడా బ్రో మూవీ కలెక్షన్ కాస్త తగ్గాయి. ఒకవేళ అన్ని అనుకూలాంగా ఉంది ఉండే రికార్డ్ ఓపెనింగ్స్ సాధించేది బ్రో మూవీ. ఇక కేవలం రేండు తెలుగు రాష్ట్రాలలో కలిపి బ్రో సినిమా మొదటిరోజు రూ.26 కోట్ల గ్రాస్ రాబట్టింది. రానున్న రెండు రోజులు వాతావరణం కూడా సహరించేలా ఉంది కాబట్టి.. ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఆడియన్స్ నుండి ఈ సినిమాకు పాజిటీవ్ టాజ్ వచ్చింది. ఈ టాక్ కూడా మూవీ కలెక్షన్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.