ఒసిజెక్ (క్రొయేషియా): స్టార్ షూటర్లు మాను బాకెర్, యశస్విని సింగ్ దేస్వాల్, రాహీ సర్నోబాత్‌తో కూడిన ఇండియా టీమ్.. ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ వరల్డ్‌కప్‌లో మెరిసింది. శుక్రవారం జరిగిన విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఇండియా 16–12తో హంగేరి (వెరోనికా మేజర్, మిరియమ్ జాకో, సారా ఫ్యాబియన్)పై గెలిచి బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. 573 పాయింట్లతో ఈ ముగ్గురు బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌కు అర్హత సాధించారు. అంతకుముందు జరిగిన మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తొమర్, దీపక్ కుమార్, దివ్యాన్ష్ సింగ్ పన్వర్‌తో కూడిన ఇండియా.. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో సెర్బియా 16–14తో ఇండియాపై గెలిచి థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. ఇక విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్‌లో అంజుమ్ మౌద్గిల్, అపూర్వి చండేలా, ఎలావనిల్ వాలరివన్ బృందం 1867.6 పాయింట్లతో 11వ ప్లేస్‌తో సరిపెట్టుకుంది.
