క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ కూడా దీటుగా ఆడుతోంది. హ్యారీ బ్రూక్ (132 బ్యాటింగ్) సెంచరీ చేయడంతో.. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 74 ఓవర్లలో 319/5 స్కోరు చేసింది. బ్రూక్‌తో పాటు బెన్ స్టోక్స్ (37 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఒలీ పోప్ (77), బెన్ డకెట్ (46) రాణించినా, జాకబ్ బీథెల్ (10), రూట్ (0) నిరాశపర్చారు.
నేథన్ స్మిత్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు 319/8 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 91 ఓవర్లలో 348 రన్స్‌కు ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్) ఆకట్టుకున్నాడు.