రేవంత్ పాదయాత్ర.. భూపాలపల్లిలో ఉద్రిక్తత

రేవంత్ పాదయాత్ర.. భూపాలపల్లిలో ఉద్రిక్తత

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. భూపాలపల్లిలో టౌన్ లో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర కార్నర్ మీటింగ్ లో  రేవంత్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు స్థానిక ఊర్వశీ థియేటర్లోకి భారీగా చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య దాడి జరిగే అవకాశం ఉందని తెలియడంతో పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు ఊర్వశీ థియేటర్ కు తాళం వేసి బయట  ఉన్నారు.