న్యూఢిల్లీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీఎం, మంత్రులు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ) బీఆర్ఎస్ ఎంపీలు ఫిర్యాదు చేశారు. అలాగే అక్కడ మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్నారని.. బుర్ఖాలతో వచ్చి దొంగ ఓట్లు వేసే చాన్స్ ఉందని ఆరోపించారు. దీన్ని నివారించేందుకు ప్రతి బూత్‌ను వెబ్కెమెరాలతో కనెక్ట్‌చేసి.. లైవ్‌ను మానిటరింగ్ చేయాలని కోరారు.
శుక్రవారం బీఆర్ఎస్ ఎంపీలు దామోదర్ రావు, కేఆర్ సురేశ్ రెడ్డి ఢిల్లీలో ఈసీకి ఈ మేరకు కంప్లైంట్ కాపీ అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు.
