
పరిగి, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన జనహిత పాదయాత్ర విజయవంతం కావడంతో బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని పరిగి మార్కెట్ చైర్మన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పరశురాంరెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. కార్యక్రమంలో పార్థసారథి పంతులు, ఎర్రగడ్డపల్లి కృష్ణ, లాల్ కృష్ణప్రసాద్, జమీల్, నసీరుద్దిన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.