సెంటి మెంట్ డైలాగ్ లతో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ విషం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

సెంటి మెంట్ డైలాగ్ లతో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ విషం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  •     కేసీఆర్‌ జాతిపిత అంటూ  కేటీఆర్‌ పిట్ట కథలు: చామల

న్యూఢిల్లీ, వెలుగు: మున్సిపల్‌ ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్​పై బీఆర్ఎస్ విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఉద్యమకాలం అంటూ సెంటిమెంట్ డ్రామాలను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. కేసీఆర్‌ను తెలంగా ణ జాతిపిత అంటూ కేటీఆర్‌ పిట్టకథలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. 

మంగళవారం  ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో చామల విలేకరు లతో మాట్లాడారు. తొండి చేసి, ఏదో రకంగా మున్సిపల్‌ ఎన్నికల్లో గెలవాలని బీఆర్‌ఎస్‌ చూస్తుందని మండిపడ్డారు. రాష్ట్రానికి రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యారని హరీశ్‌రావుకు కడుపుమంటగా ఉందని విమర్శించారు.