ఎంపీ ఎలక్షన్స్పై బీఆర్ఎస్ ఫోకస్.. గెలుపు గుర్రాలెవరు.?

ఎంపీ ఎలక్షన్స్పై బీఆర్ఎస్ ఫోకస్.. గెలుపు గుర్రాలెవరు.?

లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ సారి ఎక్కువ స్థానాలు గెలిచేలా ప్లాన్ చేస్తుంది. సిట్టింగులకు సీటివ్వాలా? లేక  కొత్త అభ్యర్థులకు ఇవ్వాలనేదానిపై వ్యూహాలు సమాలోచనలు చేస్తుంది. ఈ క్రమంలో జనవరి 3 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాలపై రివ్యూ  చేయనుంది.   అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి డీలా పడ్డ బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీని ఎదుర్కొని ఎక్కువ స్థానాలు గెలిచి సత్తా చాటాలని చూస్తోంది. 

17 లోక్ సభ స్థానాల్లో ఇప్పటి వరకు చేవేళ్ల సిట్టింగ్  ఎంపీ రంజిత్ రెడ్డికి సీటు కన్ఫర్మ్ అని తెలుస్తోంది. కేటీఆర్ తనను మళ్లీ పోటీ చేయమన్నారని ఇటీవల రంజిత్ రెడ్డి చెప్పారు. ఇంకా మిగతా స్థానాలపై అభ్యర్థులు ఎవరనేదానిపై క్లారిటీ లేదు .కాకపోతే కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

కరీంనగర్- లోక్ సభ స్థానం నుంచి  వినోద్ కుమార్ పేరు వినిపిస్తుండగా..  సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం - సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది. మల్కాజ్ గిరి నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్  ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.  నల్గొండ లేదా భువనగిరి టికెట్ తన కొడుకు కోసం  అడుగుతున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు గువ్వల బాలరాజు ఆసక్తి చూపుతున్నారు. 

 ఇక వరంగల్ టికెట్ తనకు హామీ ఇచ్చారని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య చెబుతున్నారు.  మహబూబ్ నగర్ టికెట్ తనకే హామీ ఇచ్చారని సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మరి ఇందులో అప్పటి వరకు పార్టీలు మారేదెవురో..టికెట్ దక్కించుకునేదెవరో చూడాలి.