
హైదరాబాద్, వెలుగు: బీఆర్ ఎస్ ప్రభుత్వం అన్ని కులాలను నాశనం చేసిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాలుగు కోట్ల మంది ప్రజల మనసును గెలుచుకున్నారని చెప్పారు. వడ్డీ లేని రుణాలతో పాటు మహిళల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అధిష్టానం ఎవరికి టికెట్ఇచ్చినా గెలిపించుకుంటామని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.