ఆశా, అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కార్యకర్తల జీతాలు పెంచండి: ఎంపీ సోనియా గాంధీ డిమాండ్

ఆశా, అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కార్యకర్తల జీతాలు పెంచండి: ఎంపీ సోనియా గాంధీ డిమాండ్

న్యూఢిల్లీ: ఆశా కార్యకర్తలు, అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లుగా పనిచేస్తున్నవారి జీతాలు పెంచాలని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ సోనియా గాంధీ డిమాండ్ ​చేశారు. వీరంతా ప్రజా సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నా, అధిక పనిభారం మోస్తున్నా.. తక్కువ గౌరవ వేతనం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ఇచ్చే జీతాల్లో కేంద్రం వాటాను డబుల్​ చేయాలని అన్నారు. మంగళవారం రాజ్యసభలో ఆమె జీరో అవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. 

దేశవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు టీకాలు, మొబిలైజేషన్, మాతృ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం వంటి పనులు చేస్తున్నారని, అయినా వీరు తక్కువ గౌరవ వేతనం, పరిమిత సామాజిక భద్రత పొందుతున్నారని సోనియా అన్నారు. అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం నెలకు కేవలం రూ.4,500 బేస్ గౌరవ వేతనం, సహాయకులకు రూ.2,250 మాత్రమే ఇస్తోందని తెలిపారు. పెరిగిన జనాభా మేరకు ప్రస్తుతం ఉన్న పోస్టులు సరిపోవని ఆమె చెప్పారు.