ధన్వంతరి సంస్థ ఆస్తులను వేలం వేయండి: హైకోర్టు

ధన్వంతరి సంస్థ ఆస్తులను వేలం వేయండి: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ధన్వంతరి ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ)కు సంబంధించిన ఆస్తులను వేలం వేయగా వచ్చే డబ్బును ఆ సంస్థ బాధితులకు చెల్లించాలని హైకోర్టు మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. నాంపల్లిలోని స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టు అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఆస్తులను వేలం వేయగా వచ్చిన డబ్బును ధన్వంతరి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులకు వారి పెట్టుబడుల దామాషా ప్రకారం చెల్లించాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పుతో రెండు తెలుగు రాష్ట్రాలోని సుమారు 4 వేల మందికి మేలు జరగనుంది. రెండు రాష్ట్రాల్లోని ఎనిమిది చోట్ల రూ.500 కోట్ల విలువైన ఆస్తులు ఆ సంస్థకు ఉన్నాయి. 

ధన్వంతరి సంస్థ అధిక మొత్తం తిరిగి చెల్లిస్తామని చెప్పి పలువురి నుంచి డిపాజిట్లను స్వీకరించి మోసం చేసిందని 2023లో సిటీ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.కేసును బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్​ సెంట్రల్​ క్రైం స్టేషన్​ డీసీపీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రెండు రాష్ట్రాల్లో సుమారు 450ఎకరాల భూమి, హైదరాబాద్​లో 3వేల చదరపు గజాల కమర్షియల్​ కాంప్లెక్స్​ ఉన్నట్లు గుర్తించారు. గత ఆగస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆ సంస్థల ఆస్తులను నాంపల్లి స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టు అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ఈ చర్యను ధన్వంతరి సంస్థ హైకోర్టులో సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ అప్పీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసింది. 

దీన్ని విచారించిన జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె. సుజన మంగళవారం పైవిధంగా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పల్లె నాగేశ్వర రావు వాదనలు వినిపిస్తూ.. ధన్వంతరి సంస్థ ప్రజల నుంచి రూ. 762 కోట్లు వసూలు చేసిందని, అయితే రూ. 516 కోట్లను మాత్రమే వసూలు చేసినట్టు ఆ సంస్థ ఒప్పుకుందని చెప్పారు. వాదనలు విన్న  హైకోర్టు ధర్మాసనం.. కింది కోర్టు అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్తులను వేలం వేయగా వచ్చిన సొమ్మును బాధితులకు దామాషా ప్రకారం చెల్లించాలని కోరింది. ఆస్తుల వేలం కోసం సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్టర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలంది.