గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ సీకేఎం ఆస్పత్రికి అనుబంధ ఉర్సు హాస్పిటల్లో పురుషులకు కుటుంబ నియంత్రణ క్యాంప్‌ను మంగళవారం వరంగల్ వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో సాంబశివ రావు మాట్లాడుతూ పురుషులకు చేసే వేసేక్టమీ ఆపరేషన్ సాధారణమైనదని, ఎలాంటి కోత కుట్లు లేని రెండు నిమిషాల్లో నిర్వహించే ఆపరేషన్ అని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు విజయ కుమార్, ప్రతీక్, సిబ్బంది తదితరులున్నారు.
