మహిళను ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం చేసిన ఇద్దరు సైబర్ చీటర్లు అరెస్ట్

 మహిళను ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం చేసిన ఇద్దరు సైబర్ చీటర్లు అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: ఓ మహిళను ఇన్వెస్ట్​మెంట్ పేరుతో మోసం చేసిన ఇద్దరు సైబర్ చీటర్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం డీసీపీ కవిత తెలిపిన ప్రకారం.. నగరానికి చెందిన ఓ మహిళను స్కామర్స్ వాట్సప్​ గ్రూప్​లో యాడ్ చేశారు. అధిక లాభాలు వస్తున్నట్లు నకిలీ స్క్రీన్ షాట్స్ షేర్​ చేశారు. దీంతో ఆమె రూ. 23,48,501 ఇన్వెస్ట్​ చేసి  మోసపోయింది. 

కేసు దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు, గుజరాత్ కు చెందిన ధర్మేష్ జస్వంత్ భాయ్, మహారాష్ట్రకు చెందిన మహ్మద్ షాహీద్ హనీఫ్ అన్సారీని మంగళవారం అరెస్ట్ చేశారు. మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి రెండు ఫోన్లు సీజ్ చేసి రిమాండ్ కు తరలించారు.