మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న బస్టాండ్ పనులను మంగళవారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పరిశీలించారు. ఆయనకు ఆర్టీసీ వరంగల్ రీజనల్ మేనేజర్ విజయభాను పనుల వివరాలు వివరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు.
బస్సుల వివరాలు, సిబ్బందికి రెస్ట్రూమ్స్ ఉన్నాయా అంటూ ఆరా తీశారు. ఆయనవెంట వరంగల్ డిప్యూటీ ఆర్ఎం భాను కిరణ్, ఖమ్మం ఆర్ఎం సరిరామ్ నాయక్, మంగపేట ఎస్సై పీవీఆర్ సూరి, ఆర్టీసీ ఏఈ శ్రీహరి, ఏటూరు నాగారం ఆర్టీసీ కంట్రోలర్ శంకర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
