జయశంకర్భూపాలపల్లి, వెలుగు: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు అందించాల్సిన బాధ్యత నూతనంగా ఎన్నికైన జీపీ పాలకవర్గాలదే అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలో రెండో విడతలో ఎన్నికైన సర్పంచ్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సర్పంచ్ లు ఐక్యంగా పని చేయాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశ విజయవంతంగా పూర్తి అయిందని, రెండో దశ త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓటమి చెందిన నాయకులు నిరుత్సాహ పడకుండా రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, టీపీసీసీ మెంబర్ చల్లూరి మధు, నాయకులు పులి తిరుపతిరెడ్డి, అప్పం కిషన్ తదితరులు పాల్గొన్నారు.
