అభిజ్ఞాన్‌‌‌‌ డబుల్‌‌‌‌ సెంచరీ.. 315 రన్స్‌ తేడాతో మలేసియాపై ఇండియా రికార్డ్ విక్టరీ

అభిజ్ఞాన్‌‌‌‌ డబుల్‌‌‌‌ సెంచరీ.. 315 రన్స్‌ తేడాతో మలేసియాపై ఇండియా రికార్డ్ విక్టరీ

దుబాయ్‌‌‌‌: అండర్‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌లో ఇండియా కుర్రాళ్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. యూత్‌‌‌‌ వన్డేల్లో ఇండియా తరఫున డబుల్‌‌‌‌ సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌‌‌‌గా అభిజ్ఞాన్‌‌‌‌ కుండు (125 బాల్స్‌‌‌‌లో 17 ఫోర్లు, 9 సిక్స్‌‌‌‌లతో 209 నాటౌట్‌‌‌‌) రికార్డుకు తోడు వేదాంత్‌‌‌‌ త్రివేది (90) చెలరేగడంతో.. మంగళవారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ చివరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో టీమిండియా 315 రన్స్‌‌‌‌ భారీ తేడాతో మలేసియాపై విజయం సాధించింది. ఫలితంగా హ్యాట్రిక్‌‌‌‌ విజయాలతో సెమీస్‌‌‌‌లోకి దూసుకెళ్లింది. యూత్‌‌‌‌ వన్డేల్లో రన్స్‌‌‌‌ పరంగా ఇండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం కావడం విశేషం.

 2022లో ఉగాండాపై 326 రన్స్‌‌‌‌ తేడాతో గెలిచింది. తొలుత టాస్‌‌‌‌ ఓడిన ఇండియా 50 ఓవర్లలో 408/7 స్కోరు చేసింది. ఆయుష్‌‌‌‌ మాత్రే (14), విహాన్‌‌‌‌ మల్హోత్రా (7) విఫలమైనా.. వైభవ్‌‌‌‌ సూర్యవంశీ (50) ఆకట్టుకున్నాడు. మహ్మద్‌‌‌‌ అక్రమ్‌‌‌‌ 5 వికెట్లు తీశాడు. ఛేజింగ్‌‌‌‌లో మలేసియా 32.1 ఓవర్లలో 93 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. హమ్జా పంగీ (35) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. దీపేశ్‌‌‌‌ దేవేంద్రన్‌‌‌‌ (5/22), ఉదవ్‌‌‌‌ మోహన్‌‌‌‌ (2/24) దెబ్బకు మలేసియా ఇన్నింగ్స్‌‌‌‌ కుప్పకూలింది. ఏడుగురు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితమయ్యారు. అభిజ్ఞాన్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.

యూత్‌‌‌‌ వన్డేల్లో ఇండియా తరఫున డబుల్‌‌‌‌ సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌‌‌‌గా అభిజ్ఞాన్‌‌‌‌ రికార్డులకెక్కాడు. అండర్‌‌‌‌–19 స్థాయిలో ఒక బ్యాటర్‌‌‌‌ డబుల్‌‌‌‌ సెంచరీ చేయడం ఇది రెండోసారి.  సౌతాఫ్రికా బ్యాటర్‌‌‌‌ వాన్‌‌‌‌ షాల్క్‌‌‌‌వైక్‌‌‌‌ (జింబాబ్వేపై 215) ఈ ఫీట్ సాధించాడు.