- ప్రభుత్వ పనితీరు కూడా బాగుందని ప్రశంసలు
- ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్ డాక్యుమెంట్ అందించిన సీఎం
- దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని సోనియా సూచన
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి విజన్ బాగుందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశంసించారు. ఢిల్లీలో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆమెకు అందజేశారు. ఈ నెల 8,9 తేదీల్లో రాష్ట్రంలో రెండు రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమిట్- వివరాలతో పాటు రెండేండ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. అనంతరం సోనియా మాట్లాడుతూ.. విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ దిశలో గ్లోబల్ సమిట్‌ను విజయవంతం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
