సూర్యాపేట, వెలుగు : ప్రతిష్టాత్మక ఏఎస్ రావు అవార్డు కౌన్సిల్ హైదరాబాద్ వారు డిసెంబర్ 7న నిర్వహించిన 35వ ఎస్టీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ లో సూర్యాపేట సృజన పాఠశాలకు చెందిన 9 తరగతి విద్యార్థులు సీహెచ్ అభినవ్ నందన్, ఎం.డి హస్నా హాఫ్సీన్, బి.సంజయ్ విజయం సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఎం.శ్రీనివాసరావు, ఎం.రవికుమార్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.
సత్తా చాటిన సిటీ టాలెంట్ స్కూల్ విద్యార్థులు..
డాక్టర్ ఏఎస్ రావు అవార్డు కౌన్సిల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రతిభా పరీక్షలో మంగళవారం వెలువడిన ఫలితాల్లో సిటీ టాలెంట్, సిటీ ఎలైట్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటి రెండో స్థాయికి అర్హత సాధించారు. 10 తరగతి నుంచి సురభి శాన్వి, ఆర్. వెంకట సాయి ప్రణవ్, ఎ. విద్యాచరణ్, యు.తరుణ్ శ్రీ సాయి, కె.దేహితారెడ్డి, ఆర్.శివాత్మిక, జి.దినేశ్మల్లిక్, తొమ్మిదో తరగతి నుంచి జి.జాగ్రని, ఎం. దినేశ్సాయి, వి.సాత్విక్ రాజ్, ఆర్.అక్షిత రెడ్డి, ఎ.విష్ణువర్ధన్, ఎస్.కె మీజాతనాజ్, ఎ.సాన్వి రెడ్డి, సిటీ ఎలైట్ హై స్కూల్ 9వ తరగతి నుంచి ఎం.శ్రీనిధి, కె.జెస్సికా, బి.మానస రెడ్డి రెండో స్థాయికి అర్హత సాధించారు. అర్హత సాధించిన విద్యార్థిని, విద్యార్థులను పాఠశాలల చైర్మన్ రోల్లకంటి ప్రకాశ్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ పరంపర ఇలాగే కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాలల హెడ్మాస్టర్లు టి.మురళీధర్, కిరణ్ కుమార్, సుకృతా రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏఎస్ రావు పరీక్షలో జయ ప్రభంజనం..
ఐఐటీ ఫౌండేషన్ కు కొలమానంగా పరిగణించే ఏఎన్ రావు అవార్డు కౌన్సిల్ వారు నిర్వహించిన 35వ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ మొదటి లెవెల్ లో మంగళవారం జయ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా 1,1,2,6,6,8,10,10 ర్యాంకులు సాధించడంతో రెండు రాష్ట్రాల్లో సెలెక్ట్ అయిన 248 మంది విద్యార్థుల్లో 110 మంది జయ స్కూల్ నుంచి సెలెక్ట్ కావడం ఆనందంగా ఉందని కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. కార్యక్రమంలో అర్హత సాధించిన విద్యార్థులను, కృషి చేసిన ఉపాధ్యాయులను జయ వేణుగోపాల్ డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి అభినందించారు.
పదో తరగతి నుంచి స్టేట్ ఒకటవ ర్యాంక్ డి.రిత్విక, వి.వైష్ణవి, స్టేట్ ఆరోవ ర్యాంక్ బి.హేమంత్, స్టేట్ పదవ ర్యాంక్ కె.దేవి ప్రియ, 9వ తరగతి నుంచి స్టేట్ రెండవ ర్యాంక్ వై.వీక్షణ, స్టేట్ ఆరోవ ర్యాంక్ డి.సాయిచరణ్, స్టేట్ 9వ ర్యాంక్ వి.జయ సూర్య, స్టేట్ పదవ ర్యాంక్ ఎస్.శ్రీనిధి సాధించారు. తమ విద్యార్థులు భవిష్యత్తులో ప్రతిష్టాత్మక ఐఐటీలో ప్రవేశాలు సాధించగలరని తెలిపారు. తమపై విశ్వాసాన్ని ఉంచి అన్ని విధాల సహకరిస్తున్న తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
