ఆయిల్ పామ్ తోటలను పరిశీలించిన ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల రైతులు

ఆయిల్ పామ్ తోటలను పరిశీలించిన ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల రైతులు

దమ్మపేట, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న ఆయిల్ పామ్ తోటలను పరిశీలించేందుకు ఒడిశా, చత్తీస్ గఢ్​ రాష్ట్రాలకు చెందిన రైతులు దమ్మపేట మండలం గండుగులపల్లి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం పరిశీలించారు.

 తోటలో సాగు విధానాలను, దిగుబడులు, అంతర పంటల విధానాలను, నీటి యాజమాన్యం, ఎరువుల వినియోగం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అప్పారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించి ఫ్రూట్ రవాణా, క్రషింగ్ పద్ధతులను ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ రైతులకు అవగాహన కల్పించారు.