- ఆయనపై బాల్క సుమన్ వ్యాఖ్యలు సిగ్గుచేటు
- డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్ రెడ్డి
కోల్ బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కృషి చేస్తున్నారని, ఆయనపై బాల్క సుమన్ వ్యాఖ్యలు సిగ్గుచేటని మంచి ర్యాల డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునా థ్ రెడ్డి అన్నారు. మంగళవారం చెన్నూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జైపూర్ మండలం షెట్ పల్లిలో ఇద్దరు గీత కార్మికుల మధ్య జరిగిన కుటుంబ తగాదా విషయంలో మంత్రిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
బాల్క సుమన్ ఎంపీ, ఎమ్మె ల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఇసుక, భూదందాలు, బియ్యం అక్రమణ రవాణా జోరుగా సాగాయని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి. ప్రజల బాగోగులను పట్టించుకోలే దని విమర్శించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో కోటపల్లి, చెన్నూరు మండలాల పంటలు మునిగి రైతులు నష్టపోతే పరిహారం ఇప్పించ లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రి వివేక్ రైతులకు పరిహారం ఇప్పించారని తెలిపారు.
2020లో బ్యాక్ వాటర్లో మునిగిన భూములకు గత సర్కార్ పరిహారం ఇవ్వకుంటే మంత్రి రూ.33 కోట్లు మంజూరు చేయించారని, ప్రస్తుతం రూ.10 కోట్లు కలెక్టర్ వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ నెల 19, 20 తేదీల్లో రైతులకు ఇస్తామన్నారు. కాంగ్రెస్ గెలిచిన 6 నెలల్లోనే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో జోడు. వాగుల వద్ద కోటి రూపాయలతో రోడ్డు మరమ్మ తు చేయించారన్నారు. లీడర్లు రాజమల్లయ్యగౌ డ్. హిమవంత్రెడ్డి, సూర్యనారాయణ, శ్రీధర్, మహేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు
