- కాంగ్రెస్ మద్దతుతో గెలిచినోళ్ల జాబితా రెడీ చేయాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచులతో భారీ మీటింగ్నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి భావిస్తున్నారు. గురువారం జరిగే మూడో విడత ఎన్నికలతో పంచాయతీ పోరు ముగుస్తుంది. తర్వాత ఈ నెల 20న సర్పంచుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ వెంటనే హైదరాబాద్ వేదికగా సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.
ఈ క్రమంలో నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్మద్దతుతో గెలిచిన సర్పంచుల జాబితాలను సిద్ధం చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తున్నది. సర్పంచులకు భరోసా కల్పించడంతో పాటు సర్కారు అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, సంస్థాగతంగా కాంగ్రెస్క్యాడర్ను బలోపేతం చేయడం ఈ మీటింగ్ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది.
జాబితాలు రెడీ చేస్తున్న ఎమ్మెల్యేలు..
సీఎం ఆదేశాలతో జిల్లా ఇన్-చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచుల లెక్క తీస్తున్నారు. చాలాచోట్ల కాంగ్రెస్రెబల్స్ కూడా గెలుపొందారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రెండు విడతల్లో కలిపి 8,566 పంచాయతీల్లో ఎన్నికలు జరగగా.. 5,246(61.24శాతం) మంది కాంగ్రెస్మద్దతుదారులు గెలుపొందారు. స్వతంత్రంగా బరిలోకి దిగి గెలిచిన పలువురు అభివృద్ధి కోణంలో ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వీరిలో చాలామంది కాంగ్రెస్రెబల్స్కూడా ఉన్నారు.
వీరితో పాటు వివిధ పార్టీల మద్దతుతో గెలిచి అధికార పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నవారూ ఉన్నారు. ఇలా పార్టీ మద్దతుతో గెలిచినవారితోపాటు కలిసివచ్చే సర్పంచుల పూర్తి వివరాలతో ఎమ్మెల్యేలు లిస్టులు రెడీ చేస్తున్నారు. ఈ జాబితాలు అందగానే వాటి ఆధారంగా హైదరాబాద్ మీటింగ్కు సర్పంచులందరికీ ఆహ్వానాలు పంపుతామని కాంగ్రెస్ముఖ్య నేత ఒకరు తెలిపారు.
