పెనుబల్లి మండలంలో గోల్డ్ షాప్ లో చోరీ..40 గ్రాముల బంగారం అపహరణ

పెనుబల్లి మండలంలో గోల్డ్ షాప్ లో చోరీ..40 గ్రాముల బంగారం అపహరణ

పెనుబల్లి, వెలుగు : గోల్డ్ షాప్ లో దొంగ 40 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లిన ఘటన పెనుబల్లి మండలం వీఎం బంజర్​లో శనివారం జరిగింది. గోల్డ్​షాప్​ఓనర్ వివరాల ప్రకారం.. వీఎం బంజర్​లో ఆచారి జ్యువెలరీ షాప్ లో గోల్డ్ రింగ్ కావాలంటూ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి  బేరం ఆడాడు. డబ్బులు తీసుకొనివస్తా అని చెప్పి.. కొద్దిసేపు తర్వాత అతడు మాస్క్ పెట్టుకుని గోల్డ్ షాప్ కి మళ్లీ వచ్చాడు. బంగారు రింగ్​ కొంటున్నట్లు నటించి ర్యాక్ లోని గోల్డ్ ను తీసుకుని సంచిలో వేసుకుని పరారయ్యాడు.

అనుమానంతో షాప్​ఓనర్​ సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించగా, బంగారం ఎత్తుకెళ్లినట్లు కనిపించింది. షాప్ ఓనర్ బయటకు వచ్చి చూసేసరికి అతడు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దొంగిలించిన బంగారం 40 గ్రాములు, రూ.5.50 లక్షలు విలువ ఉంటుందని గోల్డ్ షాప్ ఓనర్ బోయిపల్లి కృష్ణమాచారి తెలిపాడు.