బీఆర్‌‌‌‌ఎస్‌‌తోనే సబ్బండ వర్గాల సంక్షేమం : పద్మారావు గౌడ్

బీఆర్‌‌‌‌ఎస్‌‌తోనే సబ్బండ వర్గాల సంక్షేమం : పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌‌ బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావుగౌడ్‌‌కు వివిధ కుల సంఘాలు, స్థానిక సంక్షేమ సంఘాలు ఎన్నికల్లో తమ మద్దతు ప్రకటిస్తున్నాయి.  సీతాఫల్‌‌మండి నుంచి వచ్చిన నందారం సీతారాం, సీనియర్ నాయకులు సాయినాథ్‌‌  ఎమ్మార్పీఎస్, ఎంఎస్ పీ నేతలు శనివారం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌‌ను కలిసి తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ సందర్భంగా  నందారం సీతారం పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. అనంతరం పద్మారావుగౌడ్‌‌ మాట్లాడుతూ..  తొమ్మిదిన్నరేళ్లుగా  కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతున్నామని తెలిపారు.  ఎన్నికల ముందు వచ్చే వ్యక్తులు, పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.  సికింద్రాబాద్ ప్రజా సంక్షేమమే తన ఏకైక ఎజెండాగా వ్యవహరిస్తున్నానని పేర్కొన్నారు.  శ్రీనివాస్ నగర్, పార్సిగుట్ట మేరు సంఘం అధ్యక్షుడు రామగిరి కొండయ్య నేతృత్వంలో ప్రతినిధులు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ను కలిసి తమ మద్దతు లేఖను అందించారు.