తీహార్ జైల్లోనే.. కవితను అరెస్ట్ చేసిన సీబీఐ

తీహార్ జైల్లోనే.. కవితను అరెస్ట్ చేసిన సీబీఐ

ఎమ్మెల్సీ కవిత విచారణలో బిగ్ ట్విస్ట్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ ద్వారా.. జైలులో ఉన్న కవితను.. ఇదే కేసులో సీబీఐ విచారణ చేస్తుంది. ప్రస్తుతం కవిత మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయగా.. ఇప్పుడు తాజాగా.. అంటే 2024, ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసింది సీబీఐ. 

ఈ కేసులో గతంలోనే కవితను.. హైదరాబాద్ లో విచారించింది సీబీఐ. ఈడీ అరెస్ట్ తర్వాత.. జైలులోనే.. ఏప్రిల్ 6వ తేదీన సీబీఐ మరోసారి ప్రశ్నించింది. రెండు సార్లు విచారించినా.. సమాధానం దొరక్కపోవటంతో ఇప్పుడు అరెస్ట్ చూపించింది సీబీఐ. 

జైలులోనే ఉన్న కవితను సీబీఐ అరెస్ట్ చేయటం ద్వారా.. ఇప్పుడు రెండు బెయిల్ పిటీషన్ల వేయాల్సి ఉంటుంది. మనీలాండరింగ్ కేసులో ఈడీపై.. లిక్కర్ పాలసీ స్కాం కేసులో సీబీఐపై కోర్టులో పిటీషన్స్ వేయాల్సి ఉంటుంది. కవితను సీబీఐ అరెస్ట్ చేయటం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.