భూములు తాకట్టు పెట్టుడేంది : కేటీఆర్

భూములు తాకట్టు పెట్టుడేంది : కేటీఆర్
  • అట్లయితే కంపెనీలకు ఏమిస్తరు
  • సర్కార్​ ల్యాండ్స్​ తనఖా పెట్టడం ప్రమాదకరం
  • ఇది మతిలేని చర్య.. తెలంగాణ ప్రగతి కుంటుపడ్తది 
  • ఆర్థికరంగాన్ని నడుపుడు రాష్ట్ర​ సర్కార్​కు చేతనైతలేదని విమర్శ

హైదరాబాద్, వెలుగు: నిధుల సమీకరణ కోసం ప్రభుత్వ భూములను రాష్ట్ర సర్కార్​ తాకట్టు పెట్టాలనుకోవడం ఏమిటని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్​ప్రశ్నించారు. భూములు తనఖా పెట్టడం ప్రమాదకరమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని నడపడం చేతగాక, భూములను తాకట్టు పెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తున్నదని బుధవారం ఆయన ట్విట్టర్​(ఎక్స్​)లో దుయ్యబట్టారు. ‘‘రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నది. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు తనఖాపెట్టి 10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం ఉంది” అని అన్నారు.

దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెట్టి వారికి రూ. 100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి.. కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక, మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉన్నది” అని కేటీఆర్​ పేర్కొన్నారు. కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని, అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య అని విమర్శించారు.

అసలే గత 7 నెలలుగా రాష్ట్ర పారిశ్రామికరంగం స్తబ్దుగా ఉంది. కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయి. పరిశ్రమలకు ఇచ్చే భూములు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెడితే.. కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి?” అని కేటీఆర్  ట్వీట్​ చేశారు.  

పెద్ద మార్పే

సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జేఎన్టీయూ క్యాంటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వండిన సాంబార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలుక పడిన ఘటనపై కూడా కేటీఆర్ ట్విట్టర్​లో స్పందించారు. ‘‘కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం పెద్ద మార్పే తీసుకొచ్చింది. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలన్నారు. మొత్తానికి.. కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్ద మార్పే తెచ్చారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి..పురుగుల అన్నం.. నీళ్ల చారు. ఈనాటి కాంగ్రెస్ పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన పరిస్థితి.. బల్లిపడిన టిఫిన్లు –  చిట్టెలుకలు తిరిగే చట్నీలు” అని దుయ్బబట్టారు.

ఈ విషాహారం తింటే.. విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు  అని ఆయన ప్రశ్నించారు. అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే విద్యార్థులకు ఈ అవస్థ వచ్చిందని పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలని, లేకపోతే విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదమని కేటీఆర్​ ట్వీట్​ చేశారు.