అమరవీరుల ఘోషతోనే బీఆర్ఎస్కు వరుస ఓటములు : ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్

అమరవీరుల ఘోషతోనే బీఆర్ఎస్కు వరుస ఓటములు : ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్
  • ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అమరవీరుల ఘోషతోనే బీఆర్ఎస్ కు వరుస ఓటములు ఎదురవుతున్నాయని రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆరోపించారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు అన్యాయం చేసిన హరీశ్​రావు ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.  

నిత్యం బూతులు మాట్లాడే హరీశ్.. ఇప్పుడు నీతులు మాట్లాడితే తెలంగాణ జనం నవ్వుకుంటున్నారని విమర్శించారు. గత పదేళ్లలో హరీశ్ సంపాదించిన ఆస్తులు ఎన్ని, అంతకు ముందు ఆయన ఆస్తి ఎంత అని ప్రశ్నించారు.