శుభవార్త..ఆసరా పింఛన్లు రూ. 6 వేలు

శుభవార్త..ఆసరా పింఛన్లు రూ. 6 వేలు

ఆసరా పింఛన్ దారులకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనలో భాగంగా తెలంగాణలో ఆసరా పింఛన్లను పెంచనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రూ. 2 వేల పెన్షన్లను 6 వేలకు పెంచుతామని వెల్లడించారు. 

ఆసరా పెన్షన్లు భారీగా పెంపు..

బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పింఛన్లను రూ. 2016 నుంచి రూ. 3 వేలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రతీ ఏడాది రూ. 500 పెంచుకుంటూ ఐదో ఏడాది నాటికి రూ. 5 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం మీద భారం పడదని చెప్పారు. దివ్యాంగుల పింఛన్ ను ఇటీవలె రూ. 4వేలు చేసుకున్నామన్నారు. ఈ పింఛన్ ను కూడా రూ. 6 వేలకు పెంచుతామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి తర్వాత దివ్యాంగుల పింఛన్ ను  రూ. 5వేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రతీ ఏడాది రూ. 300 పెంచుకుంటూ ఐదో ఏడాది నాటికి రూ. 6 వేలు చేస్తామని ప్రకటించారు. 

ALSO READ : ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం