ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. అక్టోబర్ 15 ఆదివారం సాయంత్రం 4 గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. 
భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం హర్యానాలోని ఫరీదాబాద్కు 13 కిలో మీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. 

భూకంపం ధాటికి ఇండ్లలో కొన్ని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ALSO READ : షారుఖ్, రవితేజ మల్టీస్టారర్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు