షారుఖ్, రవితేజ మల్టీస్టారర్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

షారుఖ్, రవితేజ మల్టీస్టారర్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు(Tiger nageswara rao). కొత్త దర్శకుడు వంశీ(Vamssi) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్స్ అండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. దీంతో సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

రవితేజ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో.. ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం తిరిగేస్తున్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా తాజాగా ముంబై వెళ్లిన టైగర్ నాగేశ్వర రావు మేకర్స్ అక్కడ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా రిపోర్టర్స్ ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు. అందులో ఒక రిపోర్టర్ దర్శకుడిని మల్టీస్టారర్ చేయాలంటే బాలీవుడ్ లో ఏ హీరోతో చేస్తారు అని అడిగాడు. దానికి సమాధానంగా వంశీ మాట్లాడుతూ.. నాకు షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలన్నీ చూస్తాను. నాకున్న కోరిక ఏంటంటే షారుఖ్ అండ్ రవితేజతో మల్టీస్టారర్ చేయాలని ఉంది. ఎప్పటికైనా తీస్తా అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి వంశీ చెప్పినట్టుగా రవితేజ, షారుఖ్ కాంబోలో సినిమా వస్తే మాత్రం అది నెక్స్ట్ లెవల్లో ఉంటడం ఖాయం. ఈ న్యూస్ తలుసుకున్న రవితేజ ఫాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక టైగర్ నాగేశ్వర రావు విషయానికి వస్తే.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నురూప్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 

ALSO READ : IND vs PAK: వారిపైనే అనుమానం!: 24 క్యారెట్ల గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న ఊర్వశి రౌటేలా