దసరా నవరాత్రులు..టార్గెట్​గా ప్రచారం?

దసరా నవరాత్రులు..టార్గెట్​గా ప్రచారం?
  • వేడుకలపై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫోకస్ 
  • ఎన్నికల ప్రచారానికి గణేశ్​ ఉత్సవాల మాదిరిగా విరాళాలు 
  •  ఖర్చులు భరిస్తామంటూ నిర్వహణ కమిటీలకు హామీ
  •  స్థానికంగా పార్టీకి ప్రచారం చేయాలని కండీషన్

 హైదరాబాద్, వెలుగు : బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు దసరా నవరాత్రుల్లోనూ ప్రచారానికి  రెడీ అయ్యారు. ఇప్పటికే గణేశ్ నవరాత్రి ఉత్సవాలను సద్వినియోగం చేసుకోగా.. దేవీ నవరాత్రుల్లో క్యాంపెయిన్ పైనా ఫోకస్ చేశారు.  దుర్గామాత మండపాలు సిద్ధమవుతుండగా.. విరాళాలు ఇచ్చేందుకు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులు సై అంటున్నారు. గణేశ్​మండపాల్లోనే అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగా..9 రోజులు జరిగే ఉత్సవాల సందర్భంగా యువతను ఆకట్టుకునేందుకు విరాళాలు ఇవ్వడంతో పాటు ఫ్రీగా పబ్లిసిటీ పొందవచ్చని భావిస్తున్నారు.  

Also Read : దళితబంధు రాలేదని సర్పంచ్​ ఇంటికి తాళాలు

ఉత్సవ కమిటీలకు నేతల పిలుపు 

నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కమిటీలకు స్థానిక ఎమ్మెల్యేల నుంచి పిలుపు వస్తున్నట్లు సమాచారం. ఉత్సవాలకు సరిపడా నిధులు ఇస్తామని,  ఘనంగా ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు.  అయితే.. తన గురించి స్థానికంగా ప్రచారం చేయాలనే కండీషన్ కూడా పెడుతున్నట్టు తెలుస్తోంది. బస్తీలు, కాలనీల్లో ఉత్సవాల నిర్వాహకులకు పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 24  సెగ్మెంట్లు ఉండగా ఇందులో దాదాపు 10 స్థానాల్లో వదిలేసి మిగిలిన ప్రాంతాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఒక్కో మండపానికి రూ. 10 వేల నుంచి రూ. 20  వేల వరకు విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.