దళితబంధు రాలేదని సర్పంచ్​ ఇంటికి తాళాలు

దళితబంధు రాలేదని సర్పంచ్​ ఇంటికి తాళాలు

చాలా చోట్ల దళిత బంధు పథకం చిచ్చుపెడుతోంది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో తలెత్తున్న వివాదం దుమారం రేపుతోంది. అసలైన అర్హులకు దళిత బంధు పథకం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ చాలా గ్రామాల్లో దళితబంధు రాలేదంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అధికార పార్టీ నేతలను అడ్డుకుంటున్నారు. మరోవైపు.. ఎమ్మెల్యేలకు కూడా నిరసన సెగలు తప్పడం లేదు. తాజాగా సూర్యాపేట జిల్లాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమకు దళిత బంధు రాలేదంటూ ఆందోళన నిర్వహించారు.

Also Read : దసరా నవరాత్రులు..టార్గెట్​గా ప్రచారం?

దళిత బంధు పంచుకున్నారని ఆరోపిస్తూ సర్పంచ్, వార్డు మెంబర్ల ఇండ్లకు తాళాలు వేసి.. దళితులు ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్. మండలం నెమ్మికల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దళిత బంధు పథకం యూనిట్లను సర్పంచ్, వార్డ్ మెంబర్లు, అంగన్ వాడీలు పంచుకున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.