హైదరాబాదుకు దీటుగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తా : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాదుకు దీటుగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తా : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు:  నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను హైదరాబాద్​కు దీటుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 4,5, 21, 20, 41, 47,48  డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ మున్సిపల్ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం కుటుంబంలో పదవులు పంచుకున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.

.తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థుల చావుకు కారణమైన కేసీఆర్ ఎలా జాతిపిత అవుతాడని ప్రశ్నించారు.  తనను ఐదు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చేసిన ఇక్కడి ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  డాక్టర్ ఎంఏ హాఫిజ్ ఖాన్, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్ముల మోహన్ రెడ్డి, అబ్బగోని రమేష్ గౌడ్, పాశం రామ్ రెడ్డి పాల్గొన్నారు.