యాదాద్రి, వెలుగు : భువనగిరిలోని స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి టెంపుల్లో ఆదివారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్వవాలు 17 వరకూ జరుగనున్నాయి. దీనికి సంబంధించి టెంపుల్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తులకు స్వామి వారి అన్నప్రసాదాన్ని ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంకాలం మూడున్నర గంటల వరకు అందిస్తారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించనున్నారు. పార్కింగ్, శానిటేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. అత్వసర సేవల కోసం అంబులెన్స్, ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
